మంత్రి పొంగులేటి చొరవతో ఆర్టీసీ బస్ పునరుద్ధరణ..
నేటి గదర్ న్యూస్ , ఆగస్ట్ 5 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):
రాష్ట్ర రెవెన్యూ సమాచార ప్రసార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశాలతో సోమవారం కోదాడ నుంచి కూసుమంచి వరకు ఆర్టీసీ బస్సును పునరుద్ధరించారు. గతంలో కరోనా కంటే ముందు కోదాడ నుండి నాయకన్ గూడెం వరకు ఆర్టీసీ బస్సు నడిచింది. గత నాలుగు సంవత్సరాలుగా ఈ బస్సు ఆగిపోవడం వలన ప్రయాణికులు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. నాయకన్ గూడెం గ్రామ ప్రజల విజ్ఞప్తి మేరకు మంత్రి పొంగులేటి ఆదేశాలతో సోమవారం నుంచి ఈ బస్సును పునరుద్ధరించారు. ఈ బస్సు ప్రతిరోజు ఉదయం
7 గంటలకు కోదాడలో బయలుదేరి వయా వల్లాపురం నాయకన్ గూడెం ద్వారా 8 గంటల 5 నిమిషాలకు కూసుమంచికి చేరుకొని తిరిగి కూసుమంచి నుంచి 8 గంటల 20 నిమిషాలకు బయలుదేరి వయా నాయక్ గూడెం ద్వారా 9 గంటల 25 నిమిషాలకు కోదాడకు చేరుకుంటుంది. తిరిగి అదే బస్సు కోదాడలో సాయంత్రం 4 గంటలకు బయలుదేరి 5 గంటల 5 నిమిషాలకు కూసుమంచి చేరుకొని తిరిగి 5 గంటల 15 నిమిషాలకు కూసుమంచి నుంచి బయలుదేరి వయా నాయకన్ గూడెం ద్వారా 6గంటల 20 నిమిషాలకు కోదాడకు చేరుకుంటుంది. ఈ బస్సు జిల్లాలోని కూసుమంచి, సూర్యాపేట జిల్లాలోని మోతే మండలాల ప్రజలకు సౌకర్యంగా ఉండటమే కాకుండా ఈ ప్రాంత ప్రజలు కోదాడ వెళ్లేందుకు 40 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఎన్నో సంవత్సరాల తమ కోర్కెను నెరవేర్చినందుకు ఈ ప్రాంత ప్రజలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బస్సు పునరుద్ధరణ విషయంలో తమకు సహాయ సహకారాలు అందించిన మాజీ ఎంపీటీసీ కొమురెల్లి లింగారెడ్డి కోదాడ డిపో మేనేజర్ దేవులపల్లి శ్రీ హర్ష లకు గ్రామ ప్రజలు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. సోమవారం నాయకన్ గూడెం వచ్చిన ఆర్టీసీ బస్సు సిబ్బందిని గ్రామస్తులు సాదరంగా ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొల్లపూడి వీరన్న, మాజీ ఎంపీటీసీలు కంచర్ల వీరారెడ్డి, ఎండి జహంగీర్, గ్రామ ప్రముఖులు కందిబండ జయప్రకాష్,
బూర్లే వేలాద్రి నరసింహారావు, వరగాని లక్ష్మీనారాయణ, కారం శెట్టి వెంకన్న, కొండ అంజిబాబు, వంకాయల జనార్ధన్, పిల్లి రాంబాబు, కనకారావు, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.