◆డీజిల్ పల్పర్లు కోరిన రైతులు
నేటి గద్దర్ పాడేరు న్యూస్:
పాడేరు, ఆగస్టు పాడేరు మండలం లోని మోదపల్లి కాఫీ తోటలను జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్ శనివారం పరిశీలించారు. కాపీ పంట, పల్పింగ్, పార్చ్మెంట్, అమ్మకాలు తదితర వివరాలపై కాపీరైతులతో చర్చించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు కలెక్టర్ తో మాట్లాడుతూ గ్రామంలో ఎఫ్ పి ఓ లుగా ఏర్పాటు అయ్యామని, మా గ్రూపులకు డీజిల్ పల్పర్ యూనిట్లు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా పంట దిగుబడి కోసం నిచ్చెనలు సరఫరా చేయాలని కోరారు. గ్రామంలో అంగన్వాడీ కేంద్రం మరమ్మతులకు గురైందని, దానిని బాగు చేయించాలని, గ్రామం నుండి కాఫీ తోటల వరకు రహదారి సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిరియాల కోసం సిల్వర్ ఓక్ మొక్కలు నాటే సందర్భంలో వాటితోపాటు, మామిడి నేరేడు మొక్కలు పెంచాలని సూచించారు. అదేవిధంగా కాఫీ తోటలలో అంతర పంటగా అత్యధిక లాభాలు వచ్చే జాజికాయ, జాపత్రి, లవంగాలు, యాలకులు లాంటి ఇతర స్పైసెస్ మొక్కలు వేయడం ద్వారా అధిక లాభాలు సంపాదించవచ్చని సూచించారు. కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి ట్రయల్ బేసెస్ లో జాజికాయ, యాలకులు లాంటి మొక్కలు పెంచడానికి గల అవకాశాలను అధ్యయనం చేస్తామని కలెక్టర్ తెలిపారు. రైతులకు కావలసిన బేబీ పల్పర్ యూనిట్లు, డీజిల్ యూనిట్లు, నిచ్చెనలు వివిధ పథకాల ద్వారా అందించటానికి గల అవకాశాలను పరిశీలించాలని స్పైసెస్ బోర్డ్ సీనియర్ క్షేత్ర అధికారి బి. కళ్యాణి , జిల్లా ఉద్యాన అధికారి రమేష్ కుమార్ రావులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ పర్యటనతో కాఫీ రైతులు ఆనందాన్ని వ్యక్తపరిచారు.
ఈ పర్యటనలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి రమేష్ కుమార్ రావు, స్పైసెస్ బోర్డ్ సీనియర్ క్షేత్ర అధికారి బి కళ్యాణి, ఎఫ్ ఏ ఓ, న్యూఢిల్లీ తరపున ఎస్ టి డి ఎఫ్ ఎండ్ లైన్ సర్వే చేపట్టిన పి. సామ్ రత్నాకర్ ఫిలిప్స్, స్థానిక ఎఫ్ పి ఓ అధ్యక్షులు కే సూరిబాబు, కార్యదర్శి బి దేవి, రత్నాకర్ రాజు, కాఫీ, మిరియాల రైతులు తదితరులు పాల్గొన్నారు.