నేటి గదర్ న్యూస్ , ఆగస్ట్ 10 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):
కేరళ రాష్ట్రం వయనాడ్ లో ఇటీవల కురిసిన వర్షాలకు వరద బీభత్సంతో అనేక గ్రామాలు నీట మునిగిపోయాయి.. ఆ వరదలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అనేక మంది రోడ్డున పడ్డారు. ఈ విపత్తును దేశ విపత్తుగా కేంద్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే వారికి అండగా ఉండేందుకు కూసుమంచి మండలం సీపీఐ మండల కార్యదర్శి భూక్యా నరసింహ ఆధ్వర్యంలో బాధితుల కోసం విరాళాలు సేకరిస్తున్నారు.. వారిలో మండల సహాయ కార్యదర్శి జిల్లా లింగయ్య ,మండల సమితి సభ్యులు కత్రోజు పాండురంగ చారి ,భూక్యా శ్రీకాంత్ ,జిల్లా నాగరాజు ,జిల్లా వీరయ్య ,భూక్యా నెహ్రూ ,భూక్యా హనుమా ,జిల్లా లింగయ్య ఉన్నారు.
Post Views: 193