★ యథేచ్ఛగా పక్క మండలలా రైస్ మిల్లులకు తరలింపు
★కేసులతోనే సరి పెడుతుండడంతో మళ్లీ అదే దందా
★పీడీ యాక్టుకు అవకాశం ఉన్నా దృష్టి సారించని అధికారులు
అశ్వాపురం మండలంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా మూడు పువ్వులు..ఆరు కాయలుగా కొనసాగుతోంది. పక్క మండలలో రైస్ మిల్లులు ఉండడంతో ఇక్కడ తక్కువ ధరకు కొని అక్కడ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇక్కడ ఒక్కో కుటుంబం నుంచి కిలల లెక్కన కొనుగోలు చేసి క్వింటాళ్ల లెక్కన బయట విక్రయి స్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు అప్పుడప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు తప్పితే లోతుగా దర్యాప్తు చేయడం లేదన్న ఆరోపణలున్నాయి.
రేషన్ బియ్యం దందా అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అశ్వాపురం మండల కేంద్రాన్ని రేషన్‌బియ్యం సేకరణకు అడ్డంగా మార్చుకున్నారు అక్రమ దారులు గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక ముఠాలు పని చేస్తున్నాయి. చైన్‌సిస్టంలా పని చేస్తూ ఒకరినుంచి ఒకరు ప్రజల నుంచి బియ్యం సేకరిస్తు న్నారు. వాటిని పెద్దమొత్తంలో సేకరించి తరలిస్తూ సొమ్ము చేసు కుంటున్నారు. సేకరించిన బియ్యానికి కిలోకు రూ.10వరకు కమీషన్ మిగులు తుండటంతో చాలా మంది దీనిని వృత్తిగా మలుచుకుంటున్నారు.