రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఆగస్టు 11:- ఓ వృద్ధుడు తిండి తిప్పలు లేక రోగిగా మారి మర్రిచెట్టు కింద పడి ఉన్నాడు.రెక్కలు గట్టిగా ఉన్న రోజులు కష్టం చేసి రిక్షా లాగి 50 సంవత్సరాల వయస్సు వరకు ఆరోగ్యంగా ఉన్న ఆదుకునే వారు ఎవరూ లేక అనాధగా మిగిలిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన ఓద్ది ప్రభాకర్ తినడానికి సరైన తిండి లేక రోగిగా మారాడు.అతనికి అవసరమైన వాళ్లు తిండి కోసం కొంతమంది డబ్బులు కొంతమంది తిండి పెట్టిన రోజులు ఏదో విధంగా బతికాడు.కానీ ఈ మధ్య పూర్తిగా అతని శరీరం సహకరించకపోవడంతో
నడవలేని పరిస్థితుల్లో రోడ్డు పక్కన పది రోజులుగా పడి ఉన్నాడు.ఆ పరిస్థితిని చూసి చలించిపోయిన మాజీ వార్డు మెంబర్ చంద్ర ప్రతాప్ చిన్న అతని సహాయకుడు బషీర్. కలిసి ప్రభాకర్ పడి ఉన్న స్థలానికి వెళ్లి బట్టలు మార్చి అతని శుభ్రపరచి పాలు త్రాగించి వేరే స్థలానికి మార్చారు.కానీ ఆసుపత్రికి చేర్చేవారు ఎవరు లేకపోవడంతో మళ్లీ అతనికి సేవలు చేసే వారు ఎవరని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.అతన్ని ఆసుపత్రికి చేర్పించి కనీస చికిత్స నిర్వహించి సేవ చేస్తే మరో పది కాలాలు బతుకుతాడని అంటున్నారు.ఈ అనాధ వృద్ధుడు ప్రభాకర్ విషయంలో ప్రభుత్వ అధికారులైన మున్సిపల్ అధికారులైన స్వచ్ఛంద సేవకులు ఎవరైనా మానవత దృక్పథంతో వెంటనే స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి వెంటనే ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.