నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, ఆగస్టు 11:
కేంద్ర మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట్రం తరఫున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి సీతక్క గారు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అవసరాలను మరియు ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్త అంగన్ వాడి సెంటర్లను మంజూరు చేయాలని అలాగే అంగన్ వాడీ కేంద్రాల్లో టీచర్లకు కొత్త ట్యాబ్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 3989 మిని అంగన్ వాడీలను మెయిన్ అంగన్ వాడీలకు గా మార్చామన్నారు. రిటైర్ అవుతున్న అంగన్ వాడీ టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు లక్ష రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వబోతున్నట్లు వివరించారు. ఉన్నత విద్యావంతురాలైన మంత్రి సీతక్క గారు భారత దేశంలో ఉన్న రాష్ట్రాలు కేంద్రాన్ని అడగకపోగా తెలంగాణ రాష్ట్రం తరఫున మంత్రి సీతక్క గారు మాత్రం సమయస్ఫూర్తి, గొప్ప వాక్యతుర్యంతో తెలంగాణకు సంబంధించిన అవసరతలను క్షుణ్ణంగా వివరించడం ప్రత్యేక సంతరించుకుంది.