నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట ప్రతినిధి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం సీతయ్య గూడెం, వెంగళరావు ప్రాజెక్టు లను మండల బీజేపీ నాయకులు ఆదివారం పరిశీలించారు. ప్రాజెక్టుకు గండి పడి నాలుగు సంవత్సరాలైనా పట్టించుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయమై డి ఈ దీంతో ఫోన్లో మాట్లాడడం జరిగిందని తెలిపారు. ప్రాజెక్టు మరమ్మతులకు అయ్యే ఎస్టిమేషన్ వివరాలు ప్రభుత్వానికి పంపించడం జరిగిందన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు మంజూరు కాగానే ప్రాజెక్టుకు మరమ్మతులు నిర్వహిస్తామని తెలిపినట్లు బిజెపి నాయకులు అన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి వెంగళరావు ప్రాజెక్ట్ కు మరమ్మత్తులు నిర్వహించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు గోగి కృష్ణ, గుగులోత్ శ్రీనివాస్ నాయక్(గడ్డం శ్రీను),కోడెం నాగేశ్వరరావు,చెన్నం సురేష్ తదితరులు పాల్గొన్నారు.