నేటి గదర్ న్యూస్,ఖమ్మం ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు.
తెలంగాణ గిరిజన సంఘం త్రీ టౌన్ మహాసభలో జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం
ఖమ్మం జిల్లా గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, విద్యా ఉపాధి వైద్యం సమగ్రంగా అభివృద్ధికై ఐటీడీఏ ఏర్పాటు కొరకు ఆగస్టు 15న వైరా లో జరిగే రైతు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం, విజ్ఞప్తి చేశారు. ఆదివారం తెలంగాణ గిరిజన సంఘం త్రీ టౌన్ నాలుగవ మహాసభ డుంగ్రోత్ శంకర్ నాయక్, భూక్యా భద్రమ్మ అధ్యక్షతన ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో గిరిజనుల సంక్షేమం కొరకు అధిక నిధులు కేటాయించాలని కోరారు. జిల్లా కేంద్రంలో బంజారాలకు కేటాయించిన స్థలంలో బంజారా భవన్ నిర్మాణానికి ఐదు కోట్ల రూపాయలు విడుదల చేయాలని, పోడు భూములు సాగు చేస్తున్న గిరిజన పేదలందరికీ హక్కు పత్రాలు కల్పించి, గ్రామపంచాయతీలో గూర్చిన తండాలను రెవెన్యూ గ్రామాలు గుర్తించే విధంగా ముఖ్యమంత్రి చర్యలు చేపట్టాలని తెలిపారు, కారేపల్లి ఏజెన్సీ గిరిజన మండలం కు 50 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లా సహాయ కార్యదర్శి భూక్యా శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ నగరంలో నివాసం ఉంటున్న పేద గిరిజనులకు ఇళ్ల స్థలాలు ఇల్లు మంజూరు చేసి కట్టించాలని కోరారు, జహిరపుర తండా డాడీ లంబాడీల స్మశాన వాటిక రక్షణ కల్పించి చుట్టు ప్రహరీ నిర్మించాలని ప్రభుత్వానికి కోరారు,
అనంతరం గిరిజన సంఘం నూతన కమిటీ అధ్యక్ష కార్యదర్శులుగా డుంగ్రోత్ శంకర్ నాయక్, సురేష్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికైనారు కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా సీనియర్ నాయకులు దేవత్ లాల్ సింగ్ నాయక్, రూడావత్ వస్రాం నాయక్, దోన్ వాన్ శ్రీనివాస్, బట్టు విజయ్, కేలోత్ శివ చౌహాన్, ధరావత్ పద్మ, ఆంగోతు లచ్చు, మాలోత్ లక్ష్మణ్ నాయక్.