నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి,✍️సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం,భద్రాద్రి జిల్లాలో సోమవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. ముందుగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలోని దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద 2 వ బౌద్ధ స్తూపాన్ని సందర్శించి, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అవకాశాలు, కావాల్సిన సౌకర్యాలు, పలు అంశాలు పరిశీలిస్తారు. అనంతరం ఖమ్మం పట్టణంలో ఉన్న పురాతన ఖిల్లాను సందర్శిస్తారు.ఆ తరువాత వారందరు కలిసి భద్రాచలం వెళ్లి రామయ్య దర్శనం చేసుకొంటారు.అనంతరం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న పురాతన అభివృద్ధి కార్యక్రమల గురించి చర్చించనున్నారు.
Post Views: 34