నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు.
రేపు ఉదయం 6.00 గం
ప్రజా భవన్, బేగంపేట్ నుండి డిప్యూటీ సీఎం బయలుదేరి 9.45 నిముషాలుకు నేలకొండపల్లి బుద్ధ స్థూపం మరియు వారసత్వం, పర్యాటక శాఖలో జరుగుతున్న పనులను పరిశీలిస్తారు. అనంతరం 10.20 నిముషాలకు
రోప్‌వే సదుపాయాన్ని మరియు ఇతర పర్యాటకాన్ని ఖరారు చేయడానికి ఖమ్మం పట్టణంలో ఉన్న ఖిల్లాను సందర్శిస్తారు.
ఆ తరువాత 11.40 నిముషాలుకు
వైరా టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేయడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి వైరా సరస్సును సందర్శిస్తారు.
మధ్యాహ్నం 1.30 నిముషాలుకు
భద్రాచలం ఆలయ సందర్శన – రామ మందిర దర్శనం మరియు ప్రసాద పథకం (ఆలయ పర్యాటకం, మౌలిక సదుపాయాల అభివృద్ధి మొదలైన పనుల పరిశీలిస్తారు.
మధ్యాహ్నం 3.10 నిముషాలుకు
కిన్నెరసాని సరస్సు, కిన్నెరసాని వద్ద బడ్జెట్ హోటల్ మరియు ఇతర పర్యాటక ప్రాజెక్టులు, బోటింగ్ ఏర్పాటులను పరిశీలిస్తారు. తిరిగి సాయంత్రం 5.00 గం
ఇల్లందు ‘ఎక్స్’ రోడ్స్, కొత్తగూడెం
బడ్జెట్ హోటల్, కన్వెన్షన్ హాల్ మరియు ఇతర టూరిజం ప్రాజెక్ట్ లను తనిఖీ చేస్తారు.
తిరిగి రాత్రి 9.00 గం
ప్రజా భవన్, హైదరాబాద్ చేరుకుంటారు. ఈ పర్యటనలో డిప్యూటీ సీఎం తో పాటుగా… రెవిన్యూ మంత్రి పొంగులేటి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల,పర్యాటక మరియు టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావులు పాల్గొంటారు.