నేటి గదర్ న్యూస్,హైదరాబాద్ :
.జాతీయ ఆరోగ్య మిషన్ లో 510 జీవో ను అందరికీ వర్తింప చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4000 వేల మందికి గత బి.ఆర్.ఎస్. ప్రభుత్వం అన్యాయం చేసిందని వెంటనే 4000 మందికి న్యాయం చేసి 4000 మందికి 510 జీవో అమలు చేయాలని చర్యలు వెంటనే తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావుకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం వెంటనే ప్రకటించాలని , మహిళా ఉద్యోగులకు 180 రోజులతో వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని, ప్రతి నెల 1వ తేదీ జీతాలు ఇవ్వాలని , హెల్త్ కార్డ్స్ , హెల్త్ ఇన్సూరెన్స్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ వర్తించే విధంగా తీసుకురావాలి, క్యాడర్ ఫిక్సేషన్ చేయాలని, ఎన్ హెచ్ ఎం లో 65 సంవత్సరాలు నిండినవారికి రిటర్మెంట్ ప్రకటించి ఉద్యోగి ఒక నెల పెన్షన్ 25000 ఇచ్చేటట్టుగా ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. టీ ఇట్టి ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఎఫ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సారంగుల బాలసుబ్రమణ్యం, ఆయుష్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ .శ్రీనివాస్, రాష్ట్ర ఎన్సీడీ అధ్యక్షురాలు జ్యోతి, జనగాం జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్, రాధిక, శైలజ, మల్లేశం, సుదర్శన్ మరియు తదితరులు పాల్గొన్నారు.