నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. ఎస్ సి వర్గీకరణ సాధించిన మందకృష్ణ మాదిగకు పాలాభిషేకం చేసి టపాసులు మరియు డీజే తో ఊరు మొత్తం ర్యాలీ నిర్వహించారు.ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు చిర్ర ఉపేందర్ మాట్లాడుతూ ఈనెల 13న మన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్నారు, భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయలని అన్నారు.అలాగే మాజీ మండల అధ్యక్షులు గుండ్ల రాంబాబు మాట్లాడుతూ 30 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం నిరంతరం పోరాడుతూ మాదిగ జాతి కోసం ప్రాణాన్ని సైతం ప్రాణంగా పెట్టి వర్గీకరణ సాధించే వరకు పట్టు వదలకుండా పాదయాత్ర చేసి దేశ ప్రధాని లాంటి వారిని కూడా ఒక కుల సంఘం మాదిగ మీటింగ్ వచ్చిన ఘనత మందకృష్ణ మాదిగ దక్కుతుందని అన్నారు… సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాల చేసుకునే అధికారం ఇవ్వడం జరిగిందని, మరికొద్ది రోజుల్లో తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ లో వర్గీకరణ చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకొని ఈ యొక్క రిజర్వేషన్ ఉపయోగించుకొగలరు అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పగిడిపల్లి రవీందర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు చిర్ర ఉపేందర్, వెర్పుల హరికృష్ణ, జొన్నలగడ్డ పుల్లారావు, గద్దల కిషోర్, గుండ్ల నాగరాజ్, వలపట్ల వెంకటేశ్వర్లు,గుండ్ల సుందరావు గంగదారి నాగరాజు, గుండ్ల యాకోబు, పాము ఉపేందర్, గుండ్ల తిరుపతి, గంగదారి నగేష్,గుండ్ల గోపి, గంగాధరి వెంకటేశ్వర్లు,
గుండ్ల యేసు, కుక్కల గోపి, గుండ్ల ప్రవీణ్, పాము అరుణ్ ప్రకాష్, గుండ్ల కనక రత్నం,గద్దల ధోనీ, మోదుగుల వంశీ, బండారుపల్లి మురళి, దగ్గుపాటి తిరుపతిరావు, గుండ్ల కిషోర్, మరియు మహిళలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.