– *తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి*
– *కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల హెడ్ మాస్టర్లు , ప్రిన్సిపాల్స్ తో సమీక్షా సమావేశం*
నేటి గదర్ న్యూస్ , ఆగస్ట్ 11 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):
కూసుమంచి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలేరు నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కళాశాలల ప్రిన్సిపాల్స్ తో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వారికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగు పరచాలన్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ బడులకు నడచి వచ్చే విద్యార్థులకు తమ పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సైకిళ్ళు కొనిస్తామని మంత్రి తెలిపారు. విద్యార్థులు మద్యం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండే విధంగా చూడాలని ఆయన అన్నారు. అవసరమైన పాఠశాలల్లో ఆర్ ఓ ప్లాంట్ లు ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో అమ్మ ఆదర్శ పాఠశాలలకు ఆరు వందలాది కోట్ల రూపాయలు కేటాయించామని ఆయన చెప్పారు.