రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఆగస్టు 11:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన ఓద్ది ప్రభాకర్ తినడానికి సరైన తిండి లేక రోగిగా మారాడు.అతనికి అవసరమైన వాళ్లు తిండి కోసం కొంతమంది డబ్బులు కొంతమంది తిండి పెట్టిన రోజులు ఏదో విధంగా బతికాడు.కానీ ఈ మధ్య పూర్తిగా అతని శరీరం సహకరించకపోవడంతో
నడవలేని పరిస్థితుల్లో రోడ్డు పక్కన పది రోజులుగా పడి ఉన్నాడు.ఆ పరిస్థితిని చూసి చలించిపోయిన మాజీ వార్డు మెంబర్ చంద్ర ప్రతాప్ చిన్న అతని సహాయకుడు బషీర్. కలిసి ప్రభాకర్ పడి ఉన్న స్థలానికి వెళ్లి బట్టలు మార్చి అతని శుభ్రపరచి పాలు త్రాగించి వేరే స్థలానికి మార్చారు. ఈ అనాధ వృద్ధుడిని ఆదుకునేదేవరు… ఆసుపత్రికి తీసుకెళ్లేదేవరు అన్న నేటి గద్దర్ వార్త కు స్పందించిన మండల వైద్యాధికారి హరిప్రియ ఆదేశాల మేరకు 108 వాహనంలో ఆదివారం సాయంత్రం ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యులు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.దీంతో రామాయంపేట మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.