నేటి గద్దర్ ప్రతినిధి మొక్క ఉపేందర్ గౌడ్ మేడ్చల్ జిల్లా బ్యూరో (ఆగస్టు,16);శుక్రవారం మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని అన్నోజిగుడలో సింగపూర్ టౌన్ షిప్ బ్రిడ్జి వద్ద ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా
టైర్లలో నిలిచివున్న నీటిని తొలగించి బ్లీచింగ్ వేసె పనులను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో చైర్మన్ కొండల్ రెడ్డి మాట్లాడుతూ.. వర్షా కాలం నేపథ్యం లో దోమల నివారణ చర్యలో భాగంగా ప్రతి ఒక్కరూ టైర్లలో నిలిచి ఉన్న నీటిని పూలతొట్లు, కూలర్లు మొదలగు వాటిలో నీరు నిలవకుండా, ఎప్పటికప్పుడు నీటిని తొలగించాలని, దోమల ద్వారా వ్యాపించే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరమని, ప్రతి ఒక్కరుకూడా పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ తో పాటు నాయకులు నల్లవెల్లి శేఖర్ ముదిరాజ్, సూపర్ వైజర్ శుభాష్, పరిశుద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post Views: 56