+91 95819 05907

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో సీఎం భేటి

రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారిని కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి గారితో ముఖ్యమంత్రి గారు భేటీ అయ్యారు.

✳️ ఈ ఏడాది హైద‌రాబాద్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించ‌నున్న అంత‌ర్జాతీయ కార్య‌క్ర‌మాలైన మిస్ వ‌ర‌ల్డ్‌ పోటీలు, గ్లోబ‌ల్ డీప్ టెక్ స‌ద‌స్సు, భారత్ సమ్మిట్ ఈవెంట్లు, యానిమేష‌న్ గేమింగ్‌, వీఎఫ్ఎక్స్‌తో పాటు వినోద ప‌రిశ్ర‌మ‌లో తెలంగాణ బ‌లాన్ని చాటే ఇండియా జాయ్ వంటి వేదికల వివరాలను ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు.

✳️ దౌత్య సహకారంతో జరిగే ఈ గ్లోబల్ ఈవెంట్స్‌ విజయవంతం అయ్యేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విదేశాల్లో నిర్వహించే భారత కార్యక్రమాల్లోనూ తెలంగాణ రైజింగ్‌కు తగినంత ప్రచారం, ప్రాధాన్యం కల్పించాలని విన్నవించారు.

✳️ ముఖ్యమంత్రి గారి అభ్యర్థన పట్ల విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గారు సానుకూలంగా స్పందించారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ప్రధానంగా ఉందని, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న న‌గ‌రంగా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోన్న హైద‌రాబాద్‌ నగరంలో చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌కు విదేశీ వ్యవహారాల శాఖ మద్దతు ఇస్తుందని కేంద్ర మంత్రి గారు తెలియజేశారు.

✳️ కేంద్ర మంత్రి జైశంకర్ గారితో జరిగిన భేటీలో ముఖ్యమంత్రి గారి వెంట కేంద్ర మాజీ మంత్రి స‌ల్మాన్ ఖుర్షీద్‌ గారు, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ గారు, డాక్ట‌ర్ మ‌ల్లు ర‌వి గారు, చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్న ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్

నేటి గదర్ న్యూస్,పినపాక: లోక్ అదాలత్ లో అత్యధిక కేసులు పరిష్కరించినందుకు ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గ ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో

Read More »

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

*హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ భూముల పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా కామదహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో హోలీ పండుగను పురస్కరించుకొని అంబేద్కర్ రోడ్ లో ఆయా వార్డుల్లో ప్రధాన కూడళ్ళ వద్ద ఇంటింటికి వెళ్లి ప్రజలు పనికిరాని

Read More »

నందగోకుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- విద్యార్థి దశలో ఉపాధ్యాయ వృత్తిని అనుభవించడం గొప్ప అవకాశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ అన్నారు.ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో

Read More »

బీరప్ప జాతర ఉత్సవాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగీర్తిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భీరప్ప జాతర ఉత్సవాలకు మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్

Read More »

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో సీఎం భేటి

రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం

Read More »

 Don't Miss this News !