రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగీర్తిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భీరప్ప జాతర ఉత్సవాలకు మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి హాజరయ్యారు.అనంతరం ఆమె భీరప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.జాతరలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి చిన్న పిల్లలు ఆడుకునే ఆటబొమ్మలు కొని సందడి చేశారు.ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టఐశ్వర్యలతో జీవించాలని ఆ భగవంతుడుని కోరుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో తాజా మాజీ జడ్పీటీసీ పట్లోరి మాధవి రాజు, భాగీర్తిపల్లి తాజా మాజీ సర్పంచ్ దయానంద్ యాదవ్,తాజా ఎంపీటీసీ చిలుక అనురాధ నాగరాజు,వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు,సొసైటీ చైర్మన్ లు,మండల ముఖ్య నాయకులు,కురుమ సంఘం పెద్దలు మల్లేశం,బాలయ్య, కురుమ సంఘం అధ్యక్షులు దుర్గేష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
