రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- విద్యార్థి దశలో ఉపాధ్యాయ వృత్తిని అనుభవించడం గొప్ప అవకాశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ అన్నారు.ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవంలో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి అనుభూతినీ పొందారు. ఇందులో భాగంగా పిట్ల మనస్విని ప్రధానోపాధ్యాయురాలుగా హరిత, యశస్విని, అక్షిత, తేజ, అలేఖ్య, అనుశ్రీ, లాస్య, భవ్య లు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు.ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు గణేష్, దశరథం, సౌమ్య, పాఠశాల ఛైర్మెన్ వడ్ల నర్మద లు ఉన్నారు.
Post Views: 49