• 10ఏండ్లు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని బ్రష్టు పట్టిస్తున్న కాంగ్రెస్.
• ప్రజలు అన్ని గమనిస్తున్నారు….
• దిక్కుమాలిన రాజకీయాలు పక్కన పెట్టి ఇచ్చిన హామీలు అమలు చెయ్యండి.
నేటి గదర్ న్యూస్, జూలూరుపాడు:
BRS నేత, మాజీ మంత్రి ,ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ప్రజల కాంగ్రెస్ పార్టీ వారు ఎన్నికల సమయంలో చెప్పిన మాయ మాటలను నమ్మి గెలిపిస్తే ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతగాక వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తున్న బీఆర్ఎస్ పార్టీ వారిపై మరీ ముఖ్యంగా ఒక శాసనసభ్యుడి క్యాంప్ కార్యాలయంపై దాడి చేయడం సిగ్గుచేటని పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ నాడు ఇలాంటి సంప్రదాయం కనపడలేదని. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త పద్ధతులను అలవాటు చేస్తున్నారని. ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలతో యావత్ దేశానికి ఏం సందేశం ఇస్తున్నారని. తెలంగాణ అంటే ఇతర రాష్ట్రాలకు ఉన్న గౌరవాన్ని పోగొడుతున్నారని. ఇలాంటి నీచమైన రాజకీయాలు.. దిక్కుమాలిన రాజకీయాలు… రౌడి రాజకీయాలు పక్కన పెట్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే పని చెయ్యాలని లేదంటే ప్రజలు తరిమి కొట్టే రోజు వస్తుందని… ఇప్పటికే ప్రజలు తీవ్ర వ్యతిరేకం ఉందని ఇప్పటికీ ఇప్పుడు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి వెళ్తే కొట్టే పరిస్థితి ఉందని. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఇలాంటి దిక్కుమాలిన పనులు మల్లొక్కసారి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.