రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) జనవరి 30:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం డి.ధర్మారం గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కుష్టువ్యాధి నిర్మూలన కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ హరిప్రియ మాట్లాడుతూ గ్రామాలలో ఎవరికైనా శరీరంపై తెల్ల మచ్చలు ఉండి స్పర్శ లేకుండా ఉంటే కుష్టువ్యాధి గా గుర్తించవచ్చని తెలిపారు.అలాంటి వారు ఎవరైనా గ్రామాలలో ఉంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ఆశ వర్కర్లకు తెలిపి తగిన పరీక్షలు చేసుకొవాలని,వ్యాధి నిర్ధారణ అయినట్లయితే వారికి ఉచితంగా మందులను పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.కుష్టువ్యాధి నిర్మూలన కోసమే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వెల్లడించారు.అనంతరం ఆస్పత్రి ఆవరణలో ఆశ వర్కర్లు ఏఎన్ఎంలు కలిసి కుష్టువ్యాధి నిర్మూలన కోసం ప్రతిజ్ఞ చేయడం జరిగిందని తెలియపరచారు.ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ హరిప్రియ,సిహెచ్ఓ కొండయ్య,పిహెచ్ఎన్ రాణి మనోహర,సూపర్వైజర్లు ఉజ్వల,దీవెన ఏఎన్ఎం లు ఆశ వర్కర్లు పాల్గొన్నారు.