నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 30: అశ్వారావుపేట గాంధీ బొమ్మ సెంటర్లో గల మహాత్మా గాంధీ విగ్రహానికి గురువారం బిఆర్ఎస్ పార్టీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అమలు కానీ హామీలను ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి యుఎస్ ప్రకాష్ రావు అన్నారు. డిక్లరేషన్లు, హామీలు, గ్యారంటీల పేరుతో 420 బూటకపు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం మాటల రూపంలో ఇచ్చిందన్నారు. ఈ మండల కార్యదర్శి జుజ్జూరపు వెంకన్న బాబు, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ సత్యవరపు సంపూర్ణ, మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, వగ్గేల పూజ, మందపాటి మోహన్ రెడ్డి, సీమకూర్తి వేంకటేశ్వర రావు, జుజ్జురపు శ్రీరామమూర్తి, చిప్పనపల్లి బజారయ్య, తాళం సూరి, ధర్మా, వెంకన్న బాబు, బుజ్జిబాబు, గుప్తా, గుడవర్తి వేంకటేశ్వర రావు, సోమని రమేష్, శెట్టిపల్లి రఘురాం,శ్రీరామమూర్తి, జోసెఫ్, యువజన విభాగం మోటూరి మోహన్, కలపాల సురేష్, తగరం హరి, చరణ్ తదితరులు పాల్గొన్నారు.