– స్థానిక ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తో కలిసి పలు కుటుంబాలకు పరామర్శ
–
నేటి గదర్ న్యూస్ : వైరా ప్రతినిధి
ఖమ్మం : తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వైరా నియోజకవర్గంలో శుక్రవారం పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి స్థానిక ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తో కలిసి పర్యటన కొనసాగుతుందని తెలిపారు. వైరా పట్టణంలో ఇటీవల మృతిచెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంపటి రంగారావు కుటుంబాన్ని, వైరా మండలంలోని విప్పలమడకలో రిపోర్టర్ మేడా సంపత్ మాతృమూర్తి మేడా రాణి మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శిస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా గరికపాడులో అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు తేళ్లూరి విజయరావును పరామర్శిస్తారని తెలిపారు. కావున స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై మంత్రి పొంగులేటి పర్యటనను విజయవంతం చేయాలని దయాకర్ రెడ్డి కోరారు.