రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) జనవరి 30:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో రైతు వేదిక నందు మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మరియు అలీంకో సంస్థ ఆధ్వర్యంలో ఉచిత బ్యాటరీ ఎంపిక మరియు కృతిమ అవయవాల కొలతల కోసం శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా శిశు సంక్షేమ అధికారి హైమావతి మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ఉచిత పరికరాల కోసం శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.దివ్యాంగుల కొరకు ఉచిత పరికరాల కోసం ఈరోజు రామాయంపేటలో ప్రాజెక్టు కింద ఉన్న ఏడు మండలాల దివ్యాంగుల శిబిరాన్ని ఏర్పాటు చేసి వారి నుంచి దరఖాస్తులను తీసుకోవడం జరుగుతుందన్నారు.అర్హులైన దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉచితంగా ట్రై సైకిళ్ల పంపిణీ,అందులుగా ఉన్న వారికి చేతి కర్ర వీల్ చెర్ లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.అలీంకో సంస్థ ద్వారా వీరికి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.అదేవిధంగా రేపు నర్సాపూర్ లో దివ్యాంగుల శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.దివ్యాంగుల సర్టిఫికెట్ ఆధారంగానే వారికి ఉచితంగా ఈ పరికరాలు పంపిణి చేయడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా డిడబ్ల్యూఓ అధికారి హైమావతి,మండల సిడిపిఓ స్వరూప రాణి,జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పాండు,జిల్లా దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షులు కుమ్మరి కుమార్,గౌరవ అధ్యక్షులు సంజీవులు,జిల్లా వికలాంగుల మహిళా విభాగం అధ్యక్షురాలు గంగమణి తదితరులు పాల్గొన్నారు.