నేటి గదర్ న్యూస్ ఆగష్టు 17: వైరా నియోజకవర్గ ప్రతినిధి, శ్రీనివాసరావు.
వైరా : వైరా లో ప్రైవేట్ హాస్పిటల్లో 24 గంటలు ఓపి సేవలు బంద్ చేసినారు.ఐఎంఏ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించినారు.
కోటయ్య హాస్పిటలనుండి వైరా రింగ్ రోడ్ సెంటర్ వరకు భారీ ర్యాలీ
చేశారు.అత్యాచారానికి పాల్పడిన నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేసారు.వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, మాట్లాడుతూ కలకత్తాలో మౌమి త్ అని వైద్య విద్యార్థిని పైశాచిక అత్యాచారం, హత్య క్రూరత్వాన్ని ఖండిస్తున్నాను అని అన్నారు. విధి నిర్వహణలో ఉన్న జూనియర్ డాక్టర్ పై రేప్ చేసి హత్య చేయడం హేయమైన చర్యని ప్రజల ప్రాణాలను కాపాడే డాక్టర్లు మానప్రాణాలకు రక్షణ లేకపోవడం బాధాకరమని అన్నారు.బొంతు రాంబాబు, పారుపల్లి కృష్ణారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు, వైద్యులు డాక్టర్ కాపా మురళీకృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ కోటయ్య,డాక్టర్ పెరుమాళ్ళ కృష్ణమూర్తి,భార్గవ భాస్కరరావు,ఆశాజ్యోతి, హరిత రాజేశ్వరి,అరుణ లక్ష్మి, లయన్స్ సభ్యులు చింతోజు నాగేశ్వరరావు,మాది నేని సునీత కిషన్ రాయి,తోటకూర శ్రీకాంత్ ఉన్నారు.