చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్
ఆగస్టు 9 న పశ్చిమ బెంగాల్ కలకత్తా రెస్పిరేటరీ డిపార్ట్మెంట్ నైట్ డ్యూటీ చేస్తున్న అభయ జూనియర్ డాక్టర్ ని తెల్లవారుజామున 3:00 నుండి ఐదు గంటల వరకు ముగ్గురు దుండగులు అభయ డాక్టర్ తలని గోడకేసి కొట్టి గొంతు పట్టుకొని పిసికి అతి దారుణంగా మానభంగం చేసి చంపేశారు. ఐఎంఏ చైర్మన్ రాజీనామా చేసి కొత్త ప్రిన్సిపాల్ వచ్చినప్పటికీ అగత్యాలు ఆగడం లేదు. చివరికి స్వయాన ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలో ర్యాలీకి దిగిందంటే ఎంత రక్షణ ఉందో అర్థమవుతుంది.చట్టాలను కాపాడాల్సిన పాలకులే సరి చేయకుండా రోడ్లెక్కితే ప్రజలు ఇంకెవరికి చెప్పుకుంటారని ఆయన ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలను కాపాడుతున్న డాక్టర్లను మాణభంగం చేసి చంపుతు ఉంటే ఈ పాలకులు ఏం చేస్తున్నారనీ *పి వై ఎల్(PYL) ప్రగతిశీల యువజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ ముసలి సతీష్ అన్నారు* ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమబెంగాల్లో విధుల్లో ఉన్న గుర్తుతెలియని దుండగులు హాస్పిటల్ లోకి చొరబడి అక్కడ ఉన్న స్టాఫ్ ని పోలీసు వాళ్ళని బెదిరించి బయటికి వెళ్ళగొట్టి ఒక డాక్టర్ పై అత్యాచారం చేసి ముక్కలు ముక్కలుగా చంపారు అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో చట్టాలు పనిచేస్తున్నాయో అర్థం అవుతుంది. సమస్యను పక్కదోవ పట్టించడం కోసం మమతా బెనర్జీ బీజేపీ మీద నెట్టడం బిజెపి వాళ్లు మమత బెనర్జీ పార్టీకి చెందిన గుండాలు రౌడీలను చెప్పడం ఇక్కడ సమస్యను పక్కదో పట్టిస్తున్నారని అసలు దోషుల్ని పట్టుకొని శిక్షించాలని ఆయన అన్నారు. మహిళల పైన అత్యాచారాలు అరాచకాలు మానభంగాలు కిడ్నాప్లు జరుగుతున్న ప్రభుత్వాలు మాత్రం ఏ మాత్రం స్పందించడం లేదు ఈ పాలకులు జెండాలు మారవటమే గాని వీళ్ల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆయన అన్నారు మహిళల హక్కు చట్టాన్ని అమలు చేసి మహిళా పోలీస్ స్టేషన్లు మండలానికి ఒకటి ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు ప్రజాస్వామ్యం కలిగిన దేశం లో న్యాయవ్యవస్థలో దోషులకు సవరణ శిక్షలు అమలు చేయాలని ఈ దేశ భవిష్యత్తు మహిళల పైన ఆధారపడి ఉన్నదని వారన్నారు రద్దు చేసిన ఉరిశిక్షను అమలు చేయాలని మహిళలకు రక్షణ కల్పించాలని వారు అన్నారు ఈరోజు కొయ్యూరు ఆసుపత్రి సిబ్బంది డాక్టర్లు నర్సులు అభయ అత్యాచారానికి నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో పి వై ఎల్ ప్రగతిశీల యువజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ ముసలి సతీష్ పాల్గొని మాట్లాడుతూ ఈ దేశ భవిష్యత్తు మహిళలపై ఆధారపడి ఉన్నదని ఈ పాలకొల్లు మహిళలను చిన్నచూపు మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్న నోరు మెదపని పాలకులు ఈ చేతకాని పాలకులకు అధికారం ఎందుకని ఆయన ప్రశ్నించారు ఈ స్వతంత్రం వచ్చి 78 ఏళ్లు గడుస్తున్న మహిళలకు మాత్రం స్వతంత్రం అనేది రాలేదు అర్ధరాత్రి 12 గంటలకు రోడ్డు మీద తిరుగుతూనే మహిళా స్వతంత్రం వచ్చిందని చెప్పితె ఇప్పుడు మహిళలు పగలు కూడా రోడ్లమీద తిరగలేనటువంటి దుస్థితి మన భారతదేశంలో ఉన్నది ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరవకపోతే మహిళా ఉద్యమాలు తప్పవని వారు అన్నారు.