శాస్త్ర సాంకేతిక మార్పుకు నవీన టెక్నాలజీకి అధ్యుడు శ్రీ రాజీవ్ గాంధీ గారు.
శ్రీ రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని దేశం కోరుకుంటుంది యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మొస్య ప్రేమ్ కుమార్.
నేటి గదర్ అరకు వేలి 20 Agu న్యూస్:-
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆదివాసి రాష్ట్ర చైర్పర్సన్ శ్రీమతి పాచి పెంట శాంతకుమారి ఆదేశాల మేరకు *యూత్ కాంగ్రెస్ అరకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు మొస్య ప్రేమ్ కుమార్.!* ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి 80వజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అరకు వేలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ చిత్రపటానికి పూలమాలవేసి కేక్ కట్ చేసి, అందరికీ స్వీట్లు పంచిపెట్టారు.
ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ భారత ప్రధాన మంత్రిగా రాజీవ్ గాంధీ గారు టెక్నాలజీకి ఆధ్యుడు అని తన హయంలో శాస్త్ర సాంకేతిక రంగాలలో గొప్ప గొప్ప సంస్కరణలు చేపట్టి నవీన భారతదేశంలో కొత్త కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తూ యువతకు గొప్ప మార్పు దిశగా దేశాన్ని నడిపించారని ఆయన తన చివరి ఊపిరి ఉన్నంతవరకు భారత దేశ ప్రజల సంక్షేమం కోసం దేశాన్ని ప్రగతి బాటలో నడిపించారని అన్నారు. ఆయన తన చిన్న వయసు40 సంవత్సరములోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టి భారతదేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని అన్నారు, అదేవిధంగా రాబోయే రోజుల్లో తన తనయుడైన శ్రీ రాహుల్ గాంధీ గారు భారతదేశానికి గొప్ప అభివృద్ధి దిశగా పరిపాలన అందించడానికి సిద్ధంగా ఉన్నారని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా గెలిపించి దేశానికి ఒక మార్పు దిశగా నడిపించడానికి మనమందరం శ్రీ రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తిని పాటించాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్నస్వామి ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తెలగంజి సోమేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శెట్టి భగత్ రాం జంపారంగి వెంకటబాబు నారాజి కృష్ణ కొర్ర పోతురాజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.