-బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపిపి ఏనుగు సుదర్శన్ రెడ్డి.
నేటి గద్దర్ న్యూస్ ప్రతినిధి మొక్క ఉపేందర్ గౌడ్, మేడ్చల్ జిల్లా బ్యూరో (ఆగస్టు 21);
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం లో కాంగ్రెస్ పార్టీ తరతరాల మోసకారిా బుద్ధిని మరొకసారి ప్రదర్శించిందని, ఏరు దాటగానే తెప్ప తెగలేసే గుణాన్ని ప్రదర్శిస్తుందని.. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల బారాస పాలనలో అన్ని విధాలుగా నష్టపోయిన రైతాంగాన్ని ఓట్ల రూపంలో మలుచుకునేందుకు పెద్ద ఎత్తున రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవగానే ఎస్ఎల్బిసి (స్టేట్ లెవెల్ బ్యాంకర్ కమిటీ) మీటింగ్లో రైతుల స్వల్పకాలిక రుణాలు దాదాపు 65 వేల కోట్లుగా అంచనా వేసి వాటిని ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని తర్వాత మంత్రివర్గ సమావేశంలో 31 వేల కోట్లుగా తప్పుడు లెక్కలు తేల్చి పూర్తిస్థాయి బడ్జెట్లో 26 వేల కోట్లుగా ప్రకటించి ఆఖరికి మూడో విడతగా చేసిన రుణమాఫీని కేవలం 17,933 కోట్లు మాత్రమే చేసి పూర్తిస్థాయి రుణమాఫీ చేశామని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆరంభంలోనే తన పతనానికి తానే చితిని పేర్చుకుంది. ఎద్దేడిసిన రాజ్యం రైతు ఏడ్చిన ప్రభుత్వం ఎన్నటికీ ముందట పడదని అసలు రుణమాఫీ విషయంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంక్షలు పెట్టి ఆ యొక్క పరిమితుల విషయంలో ఎవరికీ ఎటువంటి సమాచారం లేకుండా రుణమాఫీ జరిగిందని, కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకోవడం నీచమైన చర్య అని, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం ఘట్కేసర్ లోని, ఘట్కేసర్ ఫార్మర్ సొసైటీ లిమిటెడ్ లో సుమారు 1,230 మంది రైతులకు రుణమాఫీ రూపంలో తొమ్మిది కోట్ల రూపాయలను రుణమాఫీ చేయకుండా రెండు నెలల క్రితమే ఆడిట్ పూర్తయినప్పటికీ, ఆడిట్ జరగలేదని కుంటి సాకులు చెప్పి ఎగవేసే ప్రయత్నాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో బ్యాంకు ఎండి స్పష్టత ఇవ్వడం జరిగింది. ఇకనైనా ఈ యొక్క రైతులకు రుణమాఫీ వెంటనే చేయాలని లేకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పాతాళంలోకి తొక్కే విధంగా తమ కార్యచరణ, ఉంటుందని ఆయన పేర్కొన్నారు.