హుకుంపేట ప్రధాన కేంద్రంలో పారిశుధ్య లోపం – విష జ్వరాలు బారిన పడుతున్న ప్రజలు
సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేసిన – గిరిజన సంఘం నాయకులు, తాప్పుల కృష్ణారావు,పాంగి సోమన్న..
నేటి గద్దర్ హుకుంపేట న్యూస్ :-
అల్లూరి జిల్లా హుకుంపేట మండల ప్రధాన కేంద్రంలో పారిశుధ్య లోపం భారీ స్థాయికి చేరడంతో ప్రజలు క్రిమి కీటకాల బారిన పడి విష జ్వరాలకు గురవుతున్నారు. ఈ సమస్యపై హుకుంపేట గిరిజన సంఘం నాయకులు తాప్పుల కృష్ణారావు పాంగి సోమన్న మాట్లాడుతూ హుకుంపేట మండల ప్రధాన రహదారి పక్కన మరియు పురవీధుల్లో గల డ్రైనేజీలో మాత్రమే కాదు ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారం పేరుకుపోయి నిల్వ ఉండడం వలన దాని నుండి దుర్వాసన వెదజల్లడంతో ప్రధాని రహదారి పక్కన నిలబడడం లేని పరిస్థితి నేడు ఏర్పడిందని, దుర్వాసన ఒకవైపు అయితే మరోవైపు ఈ మురికి నీరు నుండి ఉత్పత్తి అయిన క్రిమికీటకాలు బారిన పడి ప్రజలు విష జ్వరాలకు గురవుతున్నారని గురి కావడమే కాదు ఇదే గ్రామానికి చెందిన అది ప్రధాన కూడలి పక్క గృహాల్లో నివాసం ఉంటున్న ముగ్గురు వ్యక్తులు డెంగ్యూ బారిన పడి నేడు ఆసుపత్రిలో చికిత్స పొందడం నిజంగా చాలా బాధాకరమైన విషయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పారిశుధ్య లోపం నిమిత్తం పలు మీడియాలు పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడు సంబంధిత పంచాయతీ యంత్రాంగం స్పందించారు, అది పూర్తిస్థాయిలో స్పందన కాదు కేవలం తూతూ మంత్ర స్పందన మాత్రమేనని ఆయన విమర్శించారు. ఇది కేవలం విమర్శ మాత్రమే కాదని ఇది నిజమని దీనికి నిదర్శనం పై ఉన్న ఫోటోలు వీడియోలు చూస్తే నేరుగా కనిపిస్తుందని అక్కడక్కడ శుభ్రం చేసి చేతులు దులిపేసుకున్నారని ఇది నిజమా కాదా అనేది గ్రామంలో ఏ పౌరుడిని అడిగినా చెప్తారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా నేను పంచాయతీ వారికి సంబంధిత అధికారులకు నేరుగా ఒకటి అడుగుతున్నాను ఇది ప్రజాధనం దుర్వినియోగం తప్ప ఇంకేమిటి అనే దానికి సమాధానం మీరే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పారిశుధ్య లోపం వలన విష జ్వరాల బారిన పడి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పడుతున్న సమస్యలు నేరుగా కనిపిస్తుంది కనుక తక్షణమే ఈ పారిశుధ్య లోపం సమస్య పరిష్కారం చేయకపోతే ప్రజలతో మమేకమై జిల్లా అధికారి యంత్రాంగంకు ఫిర్యాదు చేయడమే కాకుండా సమస్య పరిష్కారం అయ్యేవరకు స్థానిక సంబంధిత కార్యాలయాలు ముట్టడి చేయడం ఖాయమని ఆయన హెచ్చరించారు. ప్రజల ప్రాణాలు దృష్టిలో పెట్టుకొని ఈ పారిశుధ్య లోపం సమస్య పరిష్కారం చేస్తారా లేక గాలికి వదిలేస్తారా అనేది ప్రజలందరూ వేచి చూడాల్సిందే.