+91 95819 05907

పోరుబాటకు సిద్ధం కండి… రేగా

కాంగ్రెస్ చేతిలో దగాపడ్డ రైతన్న…

పోరుబాటకు సిద్ధం కండి… రేగా

కాంగ్రెస్ మెడలు వంచి రుణమాఫీ చేయిస్తాం…

ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలి…

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా…

నేటి గదర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి మణుగూరు ఆగస్టు 22:

ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో శుక్రవారం మణుగూరు మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వచ్చి ధర్నా నిర్వహించారు. అనంతరం తహసిల్దార్ సిబ్బంది సీనియర్ అసిస్టెంట్ కుంజ నరసింహారావుకి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా పాలనలో రైతు రుణమాఫీ పెద్ద మోసమని ఆయన అన్నారు.కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది 40 వేల కోట్లు చెప్పారని ఎస్ఎల్ బిసిలో 49,500 కోట్లు,క్యాబినెట్లో 31 వేల కోట్లు,బడ్జెట్లో 26 వేల కోట్లు ప్రస్తుతం ప్రకటించింది 17,900 కోట్లు 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశారని,మిగతా రైతుల పరిస్థితి ఏమిటని ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసినట్లు కాదా అని ఆయన మండిపడ్డారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష రుణమాఫీ లోనే 35 లక్షల మంది రైతులకు 17 వేల కోట్లు మాఫీ జరిగితే,అప్పుడు లక్ష వరకు 17 వేల కోట్లు రుణమాఫీ చేస్తే ఇప్పుడు 2 లక్షల మాఫీకి 18 వేల కోట్లు మాత్రమేనా ఇది చాలదా కాంగ్రెస్ చేసిన మోసం ఏమిటో చెప్పడానికని ఆరోపించారు.రైతు రుణమాఫీ,రైతుబంధు ద్వారా ఒక్క లక్ష రెండు వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి బిఆర్ఎస్ ప్రభుత్వం వేసిందని ఆయన అన్నారు.రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఇదొక బోగస్ అని మేనిఫెస్టోలో మాటిచ్చిన మాటలను తుంగలో తొక్కారని మండిపడ్డారు.ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి 3 విడతల్లో మా..మా.. అనిపించారని ఎద్దేవా చేశారు.అర్థం లేని షరతులతో రైతులను మోసం చేస్తూ,రేషన్ కార్డు,ప్రభుత్వ ఉద్యోగం,ఇన్కమ్ టాక్స్,పాసు బుక్కుల్లో పేర్లు లేవంటూ కుంటి సాకులు చెబుతూ,కాలయాపన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.అర్హులైన రైతుల్లో నేటికీ 25 శాతం మందికి రుణమాఫీ కాలేదని,75శాతం రైతులకు ఎగ్గొట్టే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఆయన అన్నారు.గొప్పగా చెప్పుకోవడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనం అని ఆయన అన్నారు.దిక్కుమాలిన ఆంక్షలతో సీఎం రేవంత్ రెడ్డి లక్షలాది మంది రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకుండా తీరని అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.రుణమాఫీ విషయంలో ఏ మంత్రి ఏం మాట్లాడుతున్నారో కాంగ్రెస్ ప్రభుత్వంలో వారికే అర్థం కావడం లేదని ఆయన హెద్దేవా చేశారు.బ్యాంకులు,అధికారులు చుట్టూ రైతులు తిరుగుతూ మొరపెట్టుకున్న ఎవరు పట్టించుకునే పరిస్థితిలో లేరని ఆయన అన్నారు.కాంగ్రెస్ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి మెడలు వంచి రైతులకు రుణమాఫీ చేయిస్తామని ఆయన అన్నారు.కాంగ్రెస్ చేతిలో దగా పడ్డ రైతన్నల్లారా పోరుబాటకు సిద్ధం కండని రైతులకు ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు ముత్యం బాబు,పిఎసిఎస్ చైర్మన్ కర్రి నాగేశ్వరరావు,తాళ్లపల్లి యాదగిరి గౌడ్,వట్టం రాంబాబు,తాతా రమణ,తడికమల్ల ప్రభుదాస్, రామ్మోహన్ రావు,ఏనిక ప్రసాద్,అక్కి నరసింహారావు,జావీద్ పాషా,పొడుతూరి విక్రమ్,హర్ష,మడి వీరన్న,బుద్దుల ప్రసాద్,బోశెట్టి రవి,తురక రామకోటి,సోంబోయిన గంగరాజు రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ బాధ్యతాయుతంగా చేపట్టాలి.

జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 శాతం ఇంటింటా సర్వే జరిగింది. సర్వే డేటా ఎంట్రీ తీరును పరిశీలించి, ఆపరేటర్లకు దిశానిర్దేశం చేస్తున్న… జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. నేటి గాదార్, ములుగు జిల్లా ప్రతినిధి,

Read More »

రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు..

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 21: ములుగు మండలం రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు నిర్వహించడం జరిగింది ఇట్టి తనికీ లలో 1)గుగులోతు స్వరూప W/o శ్రీను 2)భూక్య

Read More »

 Don't Miss this News !