రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఆగస్టు 27:- మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని ఆరోగ్యమే మహాభాగ్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఓపెన్ జిమ్ నిర్మాణంలో భాగంగా,తనవంతు సహాయంగా మంగళవారం రోజు స్థానిక ఎస్ఐ.శ్రీనివాస్ రెడ్డి 15,116 రూపాయలను అందించారు.గ్రామస్తులందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని ఓపెన్ జిమ్ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఆరోగ్యమే మహాభాగ్యం టీమ్ సభ్యులను అయన అభినందించారు.ఈ కార్యక్రమంలో పప్పుల సిద్ధరాంరెడ్డి, జిపి స్వామి,పన్యాల వెంకటరెడ్డి,కొమ్మటబాబు,తిరుపతి, చంద్రశేఖర్,ప్రసాద్, నవీన్,చంద్రకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 76