హుకుంపేట ప్రధాన కేంద్రంలో ఇసుక అక్రమ డంపింగ్ యార్డు
కొట్నాపల్లి పంచాయతీ పరిధిలో ఇసుక డంపింగ్ యార్డు –
అక్రమంగా ఇసుక రవాణా
నేటి గద్దర్ హుకుంపేట న్యూస్:
అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండల ప్రధాన కేంద్రంలో ప్రభుత్వ ఇసుక పాలసీ శ్రీకారం చుట్టకముందే ఇసుక అక్రమ డంపింగ్ యార్డ్లు దర్శనమిస్తున్నాయి. నిజమా కాదా అనేది తెలియాలంటే పై ఉన్న ఫోటోలు వీడియోలు చూస్తే నేరుగా కనిపిస్తుంది హుకుంపేట ప్రధాన కేంద్రం కోట్నాపల్లి పంచాయతీ పండిమెట్ట గ్రామ సమీపంలో ఈ అక్రమ ఇసుక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి గుట్టు చప్పుడు కాకుండా ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతుంది.
ఇంత విచ్చలవిడిగా డంపింగ్ యార్లు ఏర్పాటు చేసి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న అధికారులు మాత్రం మౌనవ్రతం పాటిస్తున్నారు, అధికారులు గుర్తించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే ఇసుక అక్రమ రవాణా ఆపకపోయిన పరవాలేదు కానీ ఇసుక అక్రమ రవాణా నిమిత్తo ఈ ఇసుక మాఫియా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఇసుక తవ్వడం వలన అక్కడ గోతులు ఏర్పడి ప్రమాదకరంగా మారుతున్నాయి,దీనివలన ప్రమాదాలు సంభవించే అవకాశాలు మెండుగా ఉన్నాయి గతంలో కూడా జరిగింది గతంలో కూడా ఉన్నాయని పలువురు అంటున్నారు ముఖ్యంగా అదే పందిమెట్ట గ్రామానికి చెందిన గిరిజనులు అక్కడ వంతెన సౌకర్యం లేకపోవడం వలన మండల కేంద్రానికి చేరుకోవాలంటే ఆ వాగులోకి దిగి నడిచి వస్తారు ఆదామరిచి ఇసుక తవ్వే ప్రదేశాలు గుర్తించకపోతే మరణాలు సంభవించడం ఖాయం: పై ఫోటోలు చూడండి పిల్లలు ఇసుక తీసిన ప్రదేశంలోనే వారి సరదాల నిమిత్తం ఈతల కొడుతున్నారు వారికి జరగడానికి ఏమైనా జరిగితే దానికి బాధ్యులు అధికారులు అనే విషయం గుర్తుంచుకోవాలని పలువురు అంటున్నారు ఏది ఏమైనాప్పటికీ ఏదైనా పత్రికల్లో మీడియాల్లో కథనాలు వస్తే సంబంధ అధికారులు అక్రమ ఇసుక రవాణాపై దాడులు చేస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో స్పందన లేదనేది నేరుగా కనిపిస్తుంది కనుక దీని వెనుక అంతర్యం నిర్లక్ష్యమా లేక ముడుపుల అనేది జిల్లా అధికారాలు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక దయచేసి జిల్లా అధికార యంత్రం ఇప్పటికైనా స్పందించి జల వనరులను కాపాడి గిరిజనులు ప్రాణాలు దృష్టిలో పెట్టుకొని అక్రమ ఇసుక రవాణాపై పూర్తిస్థాయిలో ద్రుష్టి సారించి అక్రమస్కర రవాణా చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.