నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
దళిత మహిళ స్వప్న బలవంతపు మరణానికి కారణమైన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని మాల మహానాడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి
గుదిగొండ రామకృష్ణ ,జిల్లా సహాయ కార్యదర్శి దాసరి రవి కుమార్ డిమాండ్ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో నివాసముంటున్న దళిత మహిళ ను అదే గ్రామానికి చెందిన వ్యక్తి ప్రతినిత్యం ఫోన్లు చేస్తూ వేధించేవాడు అంతేకాకుండా నేను విలేకరిని అంటూ మానసికంగా శారీరకంగా నానా రకాలుగా ఆమె ఇబ్బంది పెడుతూ ఆమెను బెదిరింపులకు గురి చేస్తూ మనోవేదనకు గురి చేశాడు. అంతేకాకుండా ఎవరూ లేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ అవమానం భరించలేక దళిత యువతి ఆత్మహత్యాయత్నం చేసి మరణించింది. ఇలాంటి దుర్మార్గమైన విలేకరిపై కచ్చితంగా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని మాల మహానాడునుంచి డిమాండ్ చేస్తున్నాం. లేనిపక్షంలో దళిత సంఘాల అందరిని ఏకం చేసి దశలవారు ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.