★కరకగూడెం గ్రామ భూ నిర్వ సితులు ఎమ్మెల్యే కు వినతిపత్రం అందజేత
నేటి గద్దర్ కరకగూడెం:పులుసు బొంత ప్రాజెక్టు కాలువ మార్పు వెయ్యాలని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఎర్ర.సురేష్ అధ్వర్యంలో పినపాక ఎమ్మెల్యే పాయం.వెంకటేశ్వర్లు ని సీతరామపూరం(కరకగూడెం)
గ్రామానికి చెందిన కొంత మంది గిరిజన రైతులు కలసి వినతిపత్రం అందజేసి, పద్మపూరం,దేవరనాగరం,వీరపూరం గ్రామల అటవీ ప్రాతల మీదుగా కాలువ వస్తే చాలా మంది రైతులకు ఉపయోగ పడుతుందని,దిని గురించి పీసా గ్రామసభలు ఏర్పాటు చేసిన సమయంలో గతంలో భద్రాచలం సబ్ డివిజన్ అర్డీఓ మంగీలాల్ కి ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోలేదు అని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పందించి సంబందిత అధికారులకు చారవాణిలో సమస్యను వివరించారు.అనంతరం అధికారు సానుకూల స్పందించడం జరిగిందని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు గొగ్గలి.రవి,చందా లక్ష్మీనారాయణ, పోలెబోయిన.రుక్నరావు,నాలి.
రామక్రిష్ణ,వెంకటేష్,సమ్మయ్య శ్రీను,ముసలయ్య,సత్యం,స్వామి తదితరులు పాల్గొన్నారు.