◆జ్యోతిరావు పూలే ఆశయాలతో కుల నిర్మూలనకై కృషి చేద్దాం
◆ట్రైబల్ ఫోరం జాతీయ కన్వీనర్ ముక్తి సత్యం
నేటి గద్దర్ న్యూస్ గుండాల: జ్యోతిరావు పూలే ఆశయాలతో కుల నిర్మూలనకై మనమంతా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం జాతీయ కన్వీనర్ ముక్తి సత్యం, న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు బండారి ఐలయ్య అన్నారు. మంగళవారం మండలం పరిధిలోని కాచనాపల్లి గ్రామంలో కుల నిర్మూలన ఆచరణాత్మక సదస్సును నిర్వహించి అనంతరం వారు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే 1873 సెప్టెంబర్ 24న సత్య బోధన సమాజం స్థాపించారని అన్నారు కులరక్కసి నిర్మూలనకై ఎంతో కృషి చేశారని అన్నారు. పాఠశాలలో ప్రజా కార్యక్రమాలు నిర్వహించడం వలన అగ్రకులాల నుండి అనేక అవమానాలు ఎదురైనప్పటికీ వాటికి ఎదుర్కొని నిలబడి దళితులకు మైనార్టీలను విద్యార్థులకు తీర్చిదిద్ది వారికి బంగారు భవిష్యత్తును అందించారని అన్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన ఇంకా కులం మతం పేరుతో అరాచకాలను కొందరు పాల్పడుతున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మార్చుకోవాలని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నూతన విద్యా విధానం పేరుతో విద్యారంగాన్ని బ్రష్టు పట్టించాలని చూస్తుందని అన్నారు. ప్రజా సాంఘిక వాదులను గొంతు నొక్కి ప్రయత్నం చేయడమే కాక వారిపై తప్పుడు కేసులు పెట్టి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వాలకు ప్రజలే బుద్ధి చెపుతారని అన్నారు. క్రమంలో నాయకులు గౌని ఐలయ్య, గుండాల మాజీ సర్పంచ్ సీతారాములు, కొప్పు సారంగపాణి, ఎనగంటి చిరంజీవి, పరిషిక రవి, కల్తీ వెంకటేశ్వర్లు, బత్తిని సత్యం, ఈసం కృష్ణ, లాలు, వీరన్న తదితరులు పాల్గొన్నారు