కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన విశ్వకర్మ పథకాన్ని వృత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలని చండ్రుగొండ మండల బీజేపీ నాయకులు గుగులోత్ శ్రీనివాస్ నాయక్ (గడ్డం శ్రీను) అన్నారు. అర్హులైన వారు మీసేవ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆయావృత్తుల్లో ఇచ్చే శిక్షణలో పాల్గొని ప్రభుత్వ సహాయ సహకారాలు పొందాలని కోరారు. అప్లై చేసుకున్న అనంతరం కొత్తగూడెంలో ఉచిత ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ ఇస్తారని తెలిపారు. అనంతరం చేతివృత్తుల యూనిట్ ఏర్పాటుకు లోన్ సౌకర్యం కల్పిస్తారని వెల్లడించారు.
Post Views: 23