+91 95819 05907

ప్రజా సమస్యలు పరిష్కారం కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలి!(CPM)మండల కార్యదర్శి కారం పుల్లయ్య.

చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్

ఈరోజు దుమ్ముగూడెం మండలం భీమవరం గ్రామంలో జరిగిన మారాయిగూడెం 7వ శాఖా మహాసభ, భీమవరం 8వ శాఖ మహాసభ కామ్రేడ్ మాజీ మండల కమిటీ సభ్యులు అమరజీవి సోయం వీరస్వామి నగర్ మాజీ సర్పంచ్ సోయం భద్రయ్య ప్రాంగణంలో కామ్రేడ్ అపక సత్యం, అపక రంగయ్య అధ్యక్షతన జరిగిన ఈ రెండు మహాసభలలో సిపిఎం పార్టీ దుమ్ముగూడెం మండల కార్యదర్శి కారం పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు మర్మం చంద్రయ్య లు మాట్లాడుతూ ప్రతి సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా సమస్యలు పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధం కావాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు, దుమ్ముగూడెం మండలంలో సిపిఎం పార్టీని పూర్వ వైభవం తీసుకొని రావాలని అమరవీరుల స్ఫూర్తితో ఆందోళన పోరాటాలు చేయాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు, కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం జమిలీ ఎన్నికలు అనే పేరుతో మరో మోసానికి తెరలేపుతుందని వారు ఈ సందర్భంగా విమర్శించారు, రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని దుమ్ముగూడెం మండలంలోని కాదు ఈ రాష్ట్రం దేశం నుండి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు బిజెపి పార్టీ కార్పోరేట్ శక్తులకు ఊడిగం చేస్తుందని సందర్భంగా వారు గుర్తు చేశారు, తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా అధికారాల్లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు మా తీసేస్తామని మాయమాటలు చెప్పి మోసం చేశారని అన్నారు రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు, అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు, మారాయి గూడెం గ్రామపంచాయతీ పరిధిలో ఆదివాసీ రైతులు తరతరాలుగా సాగు చేస్తున్న ప్రభుత్వ భూములకు ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదని, గత 2002 సంవత్సరంలో ఇచ్చిన పట్టాలు చల్లని ఇప్పుడు రెవిన్యూ అధికారులు అదేవిధంగా గత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొత్త పట్టాలు ఇవ్వలేదని వెంటనే ప్రభుత్వ అసైన్మెంట్ భూములలో సాగు చేస్తున్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని అన్నారు , అదేవిధంగా త్రీఫేస్ కరెంట్ సౌకర్యం కల్పించాలని గత నాలుగు సంవత్సరాల క్రితం కట్టిన వాళ్లకు ఇంతవరకు త్రీఫేస్ కరెంట్ లైన్లు ఇవ్వలేదని ప్రభుత్వానికి అధికారులకు గుర్తు చేశారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సిపిఎం మండల కమిటీ సభ్యులు సోయం నాగమణి మాజీ సర్పంచ్ తోడం తిరుపతిరావు, నూతనంగా మళ్ళీ తిరిగి శాఖ కార్యదర్శిగా ఎన్నికైన కోడి వీరస్వామి, మారాయిగూడెం నూతన కార్యదర్శిగా ఎన్నికైన సున్నం వెంకటేశ్వర్లు, సోడే రాముడు, సోంది అర్జున్, సోయం ముత్తయ్య, సోంది శివశంకర్, సున్నం సురేష్, వెంకటరమణ, మచ్చా పుల్లయ్య, సుబ్బయ్య, రాజు, భూపతి, సోడే వెంకటేశ్వర్లు, సోయం కామయ్య, గణేష్, రవి, ఇంకా తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ బాధ్యతాయుతంగా చేపట్టాలి.

జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 శాతం ఇంటింటా సర్వే జరిగింది. సర్వే డేటా ఎంట్రీ తీరును పరిశీలించి, ఆపరేటర్లకు దిశానిర్దేశం చేస్తున్న… జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. నేటి గాదార్, ములుగు జిల్లా ప్రతినిధి,

Read More »

రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు..

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 21: ములుగు మండలం రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు నిర్వహించడం జరిగింది ఇట్టి తనికీ లలో 1)గుగులోతు స్వరూప W/o శ్రీను 2)భూక్య

Read More »

 Don't Miss this News !