.
నేటి గద్దర్ కరకగూడెం: మండల పరిధిలోని పద్మపూరం గ్రామపంచాయతీలో గల నీలాద్రిపేట (వలస గుత్తకోయ)గ్రామంలో గుడ్ క్లాఫ్,సహస్ర గ్రూప్ హైదరాబాద్ వారి సహకారంతో ఆదర్ స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకులు తోలెం రమేష్ ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రంకి టిన్ రేకుల షెడ్ నిర్మించి దానిని బుధవారం అంగన్ వాడీ సూపర్ వైజర్ ఏ.రాజమణి స్థానిక అంగన్ వాడీ టిచ్చర్ ఈసం.స్వర్ణలత తో కలిసి ప్రారంబించారు. అనంతరం పిల్లలకు పలకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరకగూడెం మండల పరిధిలోని వలస ఆదివాసీ గ్రామాలైన అంగోరుగూడెం గ్రామంలో ప్రాథమిక పాఠశాల, అంగన్ వాడీ కేంద్రం అలాగే నీలాద్రి పేట గ్రామంలో అంగన్ వాడీ కేంద్రలాకు టిన్ రేకుల షెడ్ లు ఏర్పటు చెయ్యడం జరిగిందని,అలాగే అశ్వపూరం పాడ్ లో ప్రాథమిక పాఠశాల నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు.వీటితో పాటు మండలంలోని కొన్ని ప్రాథమిక పాఠశాల పిల్లలకు ఆట వస్తువులు,బ్యాగులు పంపిణి చేశామని,అంగన్ వాడీ పిల్లలు అట వస్తుకుడా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ అనంతారం సెక్టర్ పరిధిలోని టిచ్చర్లు,జాతీయ ఆదివాసీ గిరిజన అభ్యుదయ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి గొగ్గలి రామకృష్ణ(ఆర్కే) దొర అడ్వకేట్ దనసరి నరసింహమూర్తి దొర బట్టా.బిక్షపతి గ్రామస్థులు పాల్గొన్నారు.