ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం ప్రకటించిన సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా 5000 రూపాయలను ఎలాంటి షరతులు లేకుండా సింగరేణిలోని అన్ని విభాగాల కాంటాక్ట్ కార్మికులకు వర్తింపజేయాలని కోరుతూ సింగరేణి డైరెక్టర్ పా వెంటేశ్వర రెడ్డి గారికి ప్రగతిశీల సింగరేణి కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్, ఐ ఎఫ్ టి యు ప్రతినిధి బృందం గురువారం కొత్తగూడెం హెడ్ ఆఫీస్ లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం ఇచ్చిన ప్రతినిధి బృందంలో ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ కే. యాకూబ్ షావలి, రీజియన్ అధ్యక్షులు పి. సతీష్, ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు ఆర్.మధుసూదన్ రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి వై గోపాలరావు తదితరులు ఉన్నారు.
Post Views: 29