నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం : విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంలో జరిగిన కల్తీ ఘటనకు జాతీయ స్థాయి ఆందోళన కార్యక్రమాలలో భాగంగా , రాష్ట్ర వ్యాప్త నిరసన ప్రదర్శన లకు (విశ్వహిందూ ( విహెచ్పి ) పరిషత్ ఖమ్మం పిలుపు మేరకు పాత బస్టాండ్ నుండి పాత కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నీ ప్లే కార్డులతో నిర్వహించారు . తిరుపతి లడ్డు వివాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి . హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం వైదొలగాలి . పూజ్య పీఠాధిపతులు , స్వామీజీలు , ఆధ్యాత్మిక మరియు సామాజిక వేత్తలతో ధార్మిక పరిషత్ను ఏర్పాటు చేసి దేవాలయ వ్యవస్థను నిర్వహించాలి . దేవాలయాలలో అన్యమత ఉద్యోగస్తులను వెంటనే తొలగించాలి . అన్యాక్రాంతమైన దేవాలయ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలి , దేవాలయ స్థిర – చర ఆస్తులను పరిరక్షించాలి . దేవాదాయ శాఖను రద్దు చేయాలి . దేవాలయ వాణిజ్య సముదాయాలలో దుకాణాలు హిందువులకే ఇవ్వాలి . తెలంగాణ ప్రభుత్వం దేవాలయాలలో పూజ /ప్రసాదాల తయారీకి ఉపయోగిస్తున్న వస్తువులపై అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించాలని కోరారు . ఈ నిరసన కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా హిందూ బంధువులందరూ హాజరయ్యారు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు . ఈ కార్యక్రమంలో బొడ్ల మల్లికార్జున్,బోనాల రామకృష్ణ , నేరేండ్ల శ్రీనివాస్ , పసుమర్తి రవి , వేముల రాంబాబు , కదవెండి వేణు , శాస్త్రీ , బాలాజీ , లగడపాటి కృష్ణ , రాజు , శ్రీనివాస్ , బోడ్ల మల్లికార్జున్ , రాము , బాల్వంట్ , జయంత్ , కోనగంటి నాగమణి , కృష్ణ ప్రియ , లక్ష్మి , పద్మ , రమ మరియు వెంకటేశ్వర స్వామి భక్తులు , అయ్యప్ప భక్తులు , శివ భక్తులు , భజన మండలి సభ్యులు , వినాయక ఉత్సవ నిర్వాహకులు , దేవాలయాల కమిటీల సభ్యులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు .