చండ్రుగొండ సెప్టెంబర్ 30
చండ్రుగొండ మండలంలో గల పోకలగూడెం గ్రామంలో గతంలో ఆర్ అండ్ బి అధికారులతో పోకలగూడెం నుండి కరిసలబోడు రోడ్ బాల్యతండ వాగు వరకు ఇరు వైపులా సైడ్ డ్రైనెజ్ కి ఎష్టిమేషన్ 3.55 కోట్లతో ఎపించడం జరిగింది, ఎష్టిమేషన్ వేసిన కాపీ ని ఆర్ అండ్ బి అధికారులకు అందించామని ఎన్నికల కోడ్ రావడంతో ఆలస్యం అయిందని ఆర్ అండ్ బి ఏఈ అన్నారు, అట్టి విషయానికి డిప్యూటీ కలెక్టర్ గారికి సైడ్ డ్రైనెజ్ మంజూరి చెయ్యాలని గిరిజన ప్రాంతాలని అభివృద్ధి బాటలో నడిపించాలని గుగులోత్ శ్రీనివాస్ నాయక్ (గడ్డం శ్రీను) వినతి పత్రం అందించడం జరిగింది.
★సదరం సర్టిఫికెట్ వివరాలు ఇవ్వండి
సధరం క్యాంపు సర్టిఫికెట్ల గురించి పంచాయతి వారిగా వివరాలను అందించాలని భద్రాద్రి కొత్తగూడెం D R D A, PD గారిని కోరిన గుగులోత్ శ్రీనివాస్ నాయక్ ( గడ్డం శ్రీను )
చండ్రుగొండ మండలం నందు ప్రజలకు అందజేసిన సధరం క్యాంపు సర్టిఫికెట్లకు సంబంధించిన వివరాలను గత మూడు సంవత్సరాల నుండి ఎంత మందికి సధరం క్యాంపు సర్టిఫికెట్లు ఇవ్వబడ్డాయో అందుకు సంబంధించిన పంచాయతి వారీగా పూర్తి వివరాలను అందించాలని భద్రాద్రి కొత్తగూడెం D R D A, PD ని కోరిన గుగులోత్ శ్రీనివాస్ నాయక్ ( గడ్డం శ్రీను ) కోరారు,D R D A, PD స్పందిస్తూ మూడు రోజులలో పూర్తి డేటా అందిస్తమన్నారు.