రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) సెప్టెంబర్ 30:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని ఎర్రం విఠల్ భవన్ ఫంక్షన్ హాలులో రామాయంపేట ఏరియా మొదటి మహాసభకు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.మల్లేశం,నీలం బాబు,లక్ష్మీ నరసయ్యల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.గత 3 సంవత్సరాల కాలంలో జరిగిన పార్టీ కార్యక్రమాలు,అనుభవాలను సమీక్షించుకుని భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకోవడం జరిగింది.అలాగే ఈ మహాసభ సందర్భంగా పార్టీ 4 నాలుగు తీర్మానాలను చేసుకోవడం జరిగింది. తీర్మానాలను బాలమణి,నీలం బాబులు ప్రవేశపెట్టారు.మొదటిది అర్హులైన పేదలు రామాయంపేట మండల కేంద్రములో డబుల్ బెడ్రమ్ ఇండ్లలో సౌకర్యాలు కేటాయించాలని అన్నారు.బీడీ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా 4 వేల జీవన భృతి చెల్లించాలని రైతులకు రుణమాఫీ పూర్తి చేయాలని పేర్కొన్నారు.పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో రామాయంపేట ఏరియా నూతన కమిటీ కార్యదర్శిగా బి.బాలమణి, సహాయ కార్యదర్శలు నీలం బాబు, లక్ష్మి నరసయ్య, ప్రవీణ్, సభ్యులుగా నారాయణ,మహేందర్, పుష్పలను ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో పార్టీ కార్యదర్శి కే మల్లేశం.జిల్లా నాయకులు మల్లేశం. నారాయణ.,అజయ్,ప్రమీల.
మహేందర్.రమేష్ తదితరులు పాల్గొన్నారు.