రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) నవంబర్ 2:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో మెదక్ రోడ్ లో ఉన్న ముదిరాజ్ పార్టీ కార్యాలయంలో ముదిరాజులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు మానెగల రామకిష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బిసి కులగణన చేపట్టడానికి అన్ని ఏర్పాట్లను చేసుకుంటుందన్నారు.మన ముదిరాజ్ కులం యావత్తు ఒక్కతాటిపై ఉద్యమించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.గతంలో మన పెద్దలు బి.సి వర్గీకరణ జరిగినప్పుడు అవగాహన లేక సరియైన సమాచారం తెలుపక పోవడం వల్లనే మనలను బిసి డి గ్రూపులో వేయడం జరిగిందన్నారు. ముదిరాజులను డి గ్రూపులో వేయడం వల్ల ముదిరాజ్ జాతి విధ్య,ఉపాది,ఆర్ధిక, సామాజిక,రాజకీయ రంగాలలో వెనుకబడిన తరగతులలోనే మరింత వెనుక బడ్డమన్నారు.చిన్న పొరపాటుకు ముదిరాజులం పెద్ద శిక్షను అనుభవిస్తున్నామన్నారు. ఇప్పుడు ముదిరాజ్ యువత, మహిళలు,విధ్యావంతులు,మేదావులు,మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు చాలా వ్వూహాత్మకంగా వ్యహరించాల్సిన సమయం ఎంతైనా ఉందన్నారు.
కులవృత్తుల పైన ఆధారపడి జీవించే ముదిరాజులను వారిని డి గ్రూపులో చేర్చడం జరిగిందన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజులను బిసి ఎ గ్రూపులో చేర్చి మాకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు మానెగల రామకిష్ణయ్య,రాష్ట్ర ముదిరాజ్ మహసభ ఉపాధ్యక్షులు పుట్టి అక్షయ్ కుమార్,జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రం ఆంజనేయులు,జిల్లా మత్స్యకార సహకార సంఘం డైరెక్టర్ కృష్ణ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.