రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) నవంబర్ 2:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మెదక్ రోడ్ లో ఉన్న బిజెపి పార్టీ కార్యాలయంలో శనివారం రోజు మెదక్ నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ పంజ విజయ్ కుమార్ రామాయంపేట మున్సిపాలిటీ,మండల నాయకులతో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల పై సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రజా సమస్యలపై ఉద్యమ కార్యాచరణ,ప్రణాళిక ఏర్పాటు చేయాలని,వాటిని మరింత బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దేశానిర్దేశం చేయడం జరిగిందని అయన అన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోగా బిజెపి పార్టీని మెదక్ నియోజకవర్గంలో మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ నాయకులు,కార్యకర్తలు కలసి కట్టుగా పని చేయాలని అయన సూచించారు.ఈ కార్యక్రమంలో పట్టణ బిజెపి సీనియర్ నాయకులు శంకర్ గౌడ్, కొడపర్తి నరేందర్ చారి,కటికే కార్తీక్,ఎల్లంగౌడ్,దిలీప్ తదితరులు పాల్గొన్నారు.