+91 95819 05907

ఘనంగా బీర్సా ముండ 150వ,జయంతి వేడుకలు.

*పదహారు గ్రామపంచాయతిలలో పెసా గ్రామసభలు ఆదివాసీ గిరిజన గ్రామాలలో ఎగిరిన పచ్చ జెండాలు*
నేటి గద్దర్ కరకగూడెం: ఘనంగా భగవాన్ బీర్సా ముండ 150 వ జయంతి సందర్భంగా మండల వ్యాప్తంగా అన్ని ఆదివాసీ గ్రామాలలో ఆదివాసీ జెండాలు ఎగురవేశారు.ఈ సందర్బంగా మండల వ్యాప్తంగా అన్ని పంచాయతీలలో పెసా గ్రామసభలు నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆదివాసి ఉద్యమ నాయకులకు సన్మానాలు చేశారు.గొల్లగూడెం గ్రామపంచాయతిలో నిర్వహించిన పెసా గ్రామ సభలో ఆదివాసీ సమస్యలపై ఉద్యమాలు చేస్తున్న ఉద్యమ నాయకులు తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు సూతారి నాగేశ్వరరావుని సన్మానించారు. ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక మండల అధ్యక్షులు పోలేబోయిన వెంకటనారాయణ ఆధ్వర్యంలో మండల పరిధిలోని చిరుమళ్ళ గ్రామంలోని సమ్మక్క-సారలమ్మ ఆలయ ప్రాంగణంలో భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలకు ఆదివాసీ సంఘాల జాతీయ జేఏసీ అధ్యక్షులు చందా లింగయ్య దొర హాజరై అయన చిత్ర పటనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిర్సా ముండా తన పోరాటాలు, సంస్కృతి సాంప్రదాయంతో హక్కులు చట్టాలను కాపాడుకోవడం కోసం బ్రిటిష్ అధికారులపై తిరుగుబాటు తో పాటు పోరాటం కొనసాగించిన మహానుభావుడని స్థానిక గ్రామాలను ఏకం చేసి తన పోరాటాన్ని బ్రిటిష్ అధికారులపై పోరాటం చేసిన మొట్టమొదటి వ్యక్తి బిర్సా ముండా అని అన్నారు. నేటి యువతరం బిర్సా ముండా స్పూర్తితో ఉద్యమం కొనసాగిస్తూ ఆదివాసీలు తమ హక్కులు, చట్టాలను కొనసాగించడం కోసం ముందుకు సాగాలని ఆయన అన్నారు.అలాగే 16 గ్రామపంచాయతీలో జరిగిన బిర్సా ముండ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన పెసా గ్రామ సభలలో అటవీ హక్కుల చట్టం,పెసా చట్టలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆదివాసీ సమస్యలపై ఉద్యమాలు చేస్తున్న వారికి సన్మానాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాలలో 16 గ్రామ పంచాయతీల సెక్రటరీలు,మండల జేఏసీ ప్రధాన కార్యదర్శి కలం సాంబమూర్తి,తాజా మాజీ సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు పాయం.నరసింహరావు, ప్రచార కార్యదర్శి పొలెబోయిన.సర్వేశ్వరావు ఊకె నరేష్,చందా వీరయ్య,భుపతయ్య,తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ బాధ్యతాయుతంగా చేపట్టాలి.

జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 శాతం ఇంటింటా సర్వే జరిగింది. సర్వే డేటా ఎంట్రీ తీరును పరిశీలించి, ఆపరేటర్లకు దిశానిర్దేశం చేస్తున్న… జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. నేటి గాదార్, ములుగు జిల్లా ప్రతినిధి,

Read More »

రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు..

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 21: ములుగు మండలం రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు నిర్వహించడం జరిగింది ఇట్టి తనికీ లలో 1)గుగులోతు స్వరూప W/o శ్రీను 2)భూక్య

Read More »

 Don't Miss this News !