రామాయంపేట ( నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 18:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో సైబర్ నేరాలపై పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రాజాగౌడ్ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు చాలా విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు.ప్రజల్లో ఎంత అవగాహన తీసుకువచ్చినప్పటికీ కూడా చదువు లేని వారితో పాటు చదువుకున్న వారు చాలా సైబర్ నేరాల బారిన పడుతున్నారన్నారు. ముఖ్యంగా ఈ మధ్య ఏందంటే పార్ట్ టైం జాబ్స్ అని చెప్పి యువతకు ఏరవేస్తున్నారని అన్నారు. పార్ట్ టైం జాబ్ ఇంట్లో ఉండి చాలా ఎక్కువ సంపాదించాలని వచ్చిన ఫేక్ ఆన్లైన్ లింకులపై క్లిక్ చేయమని వారితో చాట్ చేస్తుంటే ముందు డబ్బులు వేయమని చెబుతారన్నారు. వీళ్ళ డబ్బులు ఎక్కువ వస్తున్నవి అని డబ్బులు వేస్తారు.ఆ డబ్బులు తిరిగి రావన్నమాట తెలుసుకోలేక ఇచ్చేవారు డబ్బులు ఇస్తారు. కానీ డబ్బులు వేయమనరు కాబట్టి పేక్ ఆన్ లైన్ లింకులు క్లిక్ చేసి ఎవ్వరు డబ్బులు వేయవద్దన్నారు.ఇది సింపుల్ గా కామన్ సెన్స్ తో ఆలోచించాలి అర్థం అవుతుంది.ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు డబ్బులు వేయకూడదని అన్నారు.చాలామంది పిల్లల పేరెంట్స్ కి పోలీసులమని చెప్పి డబ్బులు వేయమని నీ కొడుకు మావద్ద కస్టడీలో ఉన్నాడని డ్రగ్స్ తో దొరికినాడు చాలా ఏడుస్తున్నారని అంటారు.కానీ పోలీసులు ఎవ్వరు డబ్బులు అడగరని కంగారుతో చాలామంది పిల్లల పేరెంట్స్ వేసిన సందర్భాలు చాలా ఉన్నాయన్నారు.వాటిని ఎవ్వరూ నమ్మవద్దని అటువంటి కాల్ ఏవైనా వస్తే లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వాలి.1930 కి సమాచారం ఇస్తే సైబర్ కేసు కింద నమోదు చేసుకుంటామన్నారు.సైబర్ నేరగాళ్ల నుండి వీడియో కాల్స్ వస్తుంటాయి.ఆ వీడియో కాల్స్ ని లిఫ్ట్ చేయవద్దు వీడియో కాల్స్ లో నగ్నంగా ఉండేటట్లు చేసి ఆ మ్యూట్ వీడియోని తీసుకొని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు అడుగుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు.చాలా ఇటువంటి కంప్లైంట్స్ కూడా రిక్రూట్ అయినవి కాబట్టి అనోన్ పర్సన్స్ ఎవరు కూడా వీడియో కాల్స్ చేసిన లిఫ్ట్ చేయవద్దు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకూడదన్నారు.అదేవిధంగా కొంతమంది లాటరీ వచ్చిందని షేర్స్ లో తక్కువ టైంలో ఎక్కువ లాభాలు వస్తాయని ఇవన్నీ కూడా సైబర్ నేరాలకు ప్రక్రియలో చాలామంది ఏరవేస్తుంటారు.కష్టపడకుండా ఈజీ మని వస్తుందని దురాశతో పోతే సైబర్ నేరాల బారిన పడాల్సి వస్తుందన్నారు.ఎవరన్నా ఓటిపి అడిగినా ఎవ్వరు చెప్పకూడదు.కులగణన జరుగుతుందని కాబట్టి మీ బ్యాంకు డీటెయిల్స్ ఎవ్వరూ అడగరు ఒకవేళ అడిగిన ఇవ్వకూడదు వారి గురించి పూర్తి పూర్తిగా తెలుసుకోవాలి వారు అధికారుల నకిలీ అధికారులు అని తెలుసుకోవాలన్నారు.ఏటీఎంకు పోయినప్పుడు సరిగ్గా తెలియనివారు వేరే అనోన్ పర్సన్ కి ఏటీఎం ఇచ్చి పాస్వర్డ్ చెబుతున్నారు.అటువంటివి చాలా జరిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.మన ఏటీఎం పాస్వర్డ్ వారికి ఇస్తే మన అకౌంట్ ను వారి చేతిలో పెట్టినట్టే ఈ ఏటీఎం ని వాళ్ళు దగ్గర పెట్టుకొని పాస్వర్డ్ ని పెట్టుకొని వారి వద్ద ఉన్న ఏటీఎం మన ఏటీఎం సేమ్ ఉంటుందన్నారు.కాబట్టి సేమ్ ఏటీఎం అని రిప్లై చేస్తారు మన ఏటీఎం పాస్వర్డ్ వారి వద్ద ఉండిపోతుంది.వారు డబ్బులు డ్రా చేసుకుంటారు.కాబట్టి ఏటీఎం విత్ డ్రా చేయడం తెలియని వారు తెలిసిన వారు రావాలి.బ్యాంకులకు సంబంధించిన వారు ఓటీపీలు అడగరు ఒకవేళ అడిగిన వారు సైబర్ నేరగాళ్లు మాత్రమే అడుగుతారన్నారు.సైబర్ నేరాలపై ప్రతి గ్రామంలో ప్రతి వారం ప్రజలకు అవగాహన చేస్తున్నాం.ఇంత చేసిన ప్రజలకు తెలియకపోతే నష్టపోయేది ప్రజలు మాత్రమే సైబర్ నేరాలపై కంప్లైంట్ పోర్టల్ ఉంటుందన్నారు.డబ్బులు పోయిన వెంటనే షార్ట్ టైంలో రిపోర్టు చేస్తే కేసు రిజిస్టర్ అవుతుంది.రికవరీ చేసే అవకాశం ఉందన్నారు.ఎవరికైనా అలా జరుగుతే వెంటనే సైబర్ నెంబర్ 1930 కి కాల్ చేస్తే ఆసిడ్ చేస్తారు.ఆ కంప్లైంట్ ఆన్లైన్ లో రిజిస్టర్ అవుతుంది.దాని ద్వారా ఏ అకౌంట్లో డబ్బులు పడ్డాయో అది తెలిసిపోతుందని వాటిని రికవరీ చేస్తారన్నారు.ఈ సైబర్ నేరాల పట్ల ప్రజలు యువత మోసపోవద్దని, అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.