ఎం జె ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల బాబు మాదిగ డిమాండ్.
మాసాయిపేట మండలం
(భూపాల్ )నేటి గద్దర్ నవంబర్ 18.
మెదక్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోభవన్లో నిర్వహించిన మాదిగ వర్కింగ్ జర్నలిస్టుల సమావేశం జిల్లా అధ్యక్షులు అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రల్ల బాబు మాదిగ ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ రామస్వామి హాజరయ్యారు కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల బాబు మాదిగ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎం జె ఎఫ్ కమిటీలను నిర్మాణం చేస్తూ అందరిని జాతి హక్కుల కోసం జరుగుతున్న పోరాటంలో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేశారు ఎస్సీ ఎ బి సి డి ల వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ రాష్ట్రంలోని మాదిగలకు ఉప కులాలకు న్యాయం చేస్తానని మాట ఇచ్చి మర్చిపోయిన సంగతిని గుర్తు చేస్తూ మహా జననేత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం నోటి కాడికి వచ్చిన ముద్దను నెట్టేసిన మాల సోదరులు తిరిగి సాధించుకోవడం కోసం జాతి కోసం మనం కూడా భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ డప్పు రామస్వామి మాదిగ మాట్లాడుతూ మాదిగ జర్నలిస్టుల సమస్యలపై పోరాటం జిల్లాలో అక్కడేషన్ కమిటీలో కూడా మన వాళ్ళ పాత్ర ఉండాలి అందరికీ అక్రిడేషన్ కార్డులు అందే విధంగా ప్రభుత్వం చొరవ చూపే విధంగా ఎం జె ఎఫ్ కృషి చేస్తుందని ఇంట్లో లేని జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించాలని త్వరలో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా మెదక్ నియోజకవర్గం కమిటీని వేయడం జరిగిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సూర్య దిశ చీఫ్ బ్యూరో బచ్చనోళ్ళ అనంతయ్య మాదిగ, నమస్తే తెలంగాణ దినపత్రిక అశోక్ మాదిగ,విజన్ ఆంధ్ర తెలుగు దినపత్రిక నియోజకవర్గ ఇన్చార్జ్ మురళి మాదిగ, ఉదయ అక్షరం దినపత్రిక సామెల్ మాదిగ లు తదితరులు పాల్గొన్నారు.