రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో జరుగుతున్న కులగణన ఇంటింటి సర్వేను మున్సిపల్ కౌన్సిలర్ దేమే యాదగిరి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సర్వే వివరాలు ఎన్యుమరేటర్లకు అందించాలని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు.సమగ్రంగా సర్వేలో అన్ని వివరాలను అందించాలని అన్నారు.ఈ సర్వే రాబోయే రోజుల్లో ప్రజలకు అన్ని ప్రభుత్వ పథకాలకు ఎంతో ఉపయోగకరమని, వివరాలన్నీ గోప్యంగా ఉంచబడతాయని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఎన్యుమరేటర్ మొబిన్,యూత్ సభ్యులు పాల్గొన్నారు.
Post Views: 31