రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 19:-మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో భారత ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ 107వ జయంతి వేడుకలను ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రాంచందర్ గౌడ్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని అన్నారు.గరీభీ హటావో అనే నినాదంతో పాటు రాజా భరణములు రాజాస్తులను అందరికీ చెందే విధంగా ఆమె కృషి చేశారని పేర్కొన్నారు. బ్యాంకులను దేశంలో జాతీయంగా చేసి బలమైన శక్తిగా ఆమె పేరొందిందని అన్నారు.ఇందిరమ్మ పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు అందజేసి గృహాలను నిర్మించిందని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆమె ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విప్లవ కుమార్,జహీరోద్దీన్,బోట్ల బాబు, డాకి స్వామి,శంకరయ్య,మామిడి సిద్ధరాములు,సురేష్ నాయక్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.