నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు.
* పిలుపునిచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర నేత మద్దినేని స్వర్ణ కుమారి.
* ఎంపీ రఘురాం రెడ్డి క్యాంపు కార్యాలయంలో
ఘనంగా ఉక్కు మహిళ
జయంతి వేడుకలు.
ఖమ్మం: దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశానికి అందించిన సంక్షేమ పాలన స్ఫూర్తితో తెలంగాణలో ముందుకు సాగుతున్నామని కాంగ్రెస్ రాష్ట్ర నేత మద్దినేని స్వర్ణకుమారి అన్నారు. ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ తో కలిసి ఉక్కు మహిళ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు, శ్రేణులను ఉద్దేశించి స్వర్ణకుమారి మాట్లాడుతూ.. గరీబీ హటావో ( పేదరికాన్ని పారదోలుదాం ) అంటూ.. అట్టడుగు వర్గాలు, సామాన్యుల సంక్షేమానికి ప్రధానిగా పెద్దపీట వేశారని తెలిపారు. బ్యాంకుల జాతీయ కరణ, 20 సూత్రాల కార్యక్రమం, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి వేసిన బాటలు, అమలు చేసిన సంస్కరణలతో దేశాభివృద్ధికి విశేష కృషి చేశారని చెప్పారు. ఇందిరమ్మ పాలన స్ఫూర్తితో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతోందని అన్నారు. ఉభయ జిల్లాల అభివృద్ధికి.. మంత్రులు పొంగులేటి, భట్టి, తుమ్మల నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యస్థాపనకు అంతా కృషి చేద్దామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సత్యం బాబు, నాయకులు ఇమామ్ బాయ్, కృష్ణారెడ్డి, ప్రతిభా రెడ్డి, విప్లవ కుమార్, శ్రీకళా రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.