◆ప్రజా సంపద దోపిడీకి గురవుతుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరైనది కాదు
◆అక్రమార్కుల పట్ల అధికారుల మెతక వైఖరి మానుకోవాలి
●లూటీకి గురవుతున్న ప్రజాసంపదను అధికారులు కాపాడాలి
●అనుమానం ఉన్న ప్రతి చోట సంబంధిత అధికారులు తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి
●అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను సీజ్ చేయాలి
●తరలించిన ఇసుకను రికవరీ చేపించాలి
●అక్రమ రవాణా చేస్తున్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి
●బహుజన్ సమాజ్ పార్టీ (BSP) భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు కొండా చరణ్
…………………………………..
భద్రాచల పట్టణంలోనీ గోదావరిలో రాత్రి సమయంలో భారీ యంత్రాలతో ప్రజాసంపద అయిన ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు కొండా చరణ్ ఆరోపించారు భద్రాచల పట్టణం ప్రజలు ప్రతిరోజు సోషల్ మీడియా వాట్సాప్ వేదికగా ద్వారా తెలుపుతున్నారని ఈ మధ్యకాలంలో ఇసుక అక్రమ రవాణా అనేది సర్వసాధారణంగా మారిపోయిందని అన్నారు ప్రజా సంపదనీ కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నది అని అన్నారు అట్లాంటిది ప్రజలే బాహాటంగా విషయాన్ని తెలియజేస్తున్నారని అన్నారు అందుకు సాక్షం గోదావరిలో తవ్వకాలు జరపడం వల్ల ఏర్పడిన గుంతలు సాక్ష్యంగా నిలుస్తున్నాయని అన్నారు ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడం దుర్మార్గమని వారి నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం అని అన్నారు ప్రభుత్వానికి పన్ను ఎగవేస్తూ ఎటువంటి రుసుము కట్టకుండా చట్టాన్ని అతిక్రమిస్తూ పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో అక్రమ రవాణా చేస్తున్నటువంటి వారిపై అధికారుల ఇప్పటికైనా మెతక వైఖరి మానుకోవాలని తెలిపారు ప్రజా సంపద దోపిడీకి గురవుతుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరైనది కాదనీ
లూటీకి గురవుతున్న ప్రజాసంపదను అధికారులు కాపాడాలనీ అనుమానం ఉన్న ప్రతి చోట సంబంధిత అధికారులు చెక్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయాలనీ
అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను సీజ్ చేయాలనీ
తరలించిన ఇసుకను రికవరీ చేపించాలి అక్రమ రవాణా చేస్తున్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలనీ కోరారు లేనియెడల భవిష్యత్తులో ఈ సమస్య పరిష్కారం కోసం ప్రజా సంపాదన కాపాడుకునే దానికోసం కార్యచరణ చేపడతామని హెచ్చరించారు